ఎన్‌సీఓ అధికారిపై ఆర్మీ కోర్ట్ మార్షల్ వేటు.. ఉద్యోగం నుంచి తొలగించి ఏడాది శిక్ష..

by Dishafeatures2 |
ఎన్‌సీఓ అధికారిపై ఆర్మీ కోర్ట్ మార్షల్ వేటు.. ఉద్యోగం నుంచి తొలగించి ఏడాది శిక్ష..
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎన్‌సీఓ (నాన్ కమిషన్డ్ ఆఫీసర్)పై ఆర్మీ మార్షల్ కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు చేసిన నేరానికి పదవి నుంచి తొలగించాలని తెలిపింది. అంతేకాకుండా ఏడాది పాటు జైలు శిక్ష విధించాలని వెల్లడించింది. అయితే బాధిత మహిళా కెప్టెన్ గతేడాది రివర్ రేటింగ్ కోర్సు కోసం సిక్కింకు వచ్చింది. 17 మౌంటెయిన్ డివిజన్ ఏరియాలో కోర్సు నేర్చుకుంటున్న ఆమ అక్కడే అధికారిక అకామొడేషన్‌తో ఆమె నివసిస్తోంది. ఆ సమయంలోనే అక్కడ పనిచేస్తున్న హవల్దార్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నేరారోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

అంతేకాకుండా బలవంతంగా మహిళ గదిలోకి ప్రవేశించడమే కాకుండా, ఆ తర్వాత అతడు అశ్లీల పదజాలం వినియోగించాడని ఆరోపించారు. ఆ ఘటన జరిగిన వెంటనే బాధితురాలు ఆ గది నుంచి పారిపోయిందని, అనంతరం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఆర్మీ అధికారులు తక్షణమే స్పందించి నిందితుడిపై ట్రయిల్స్ నిర్వహించారని, అందులో అతడు ధోషిగా రుజువైందని అధికారులు తెలిపారు. ఈ కేసుపై మార్షల్ కోర్ట్ తాజాగా తుది తీర్పును ప్రకటించింది. అందులో భాగంగా ధోషిని పదవి నుంచి తొలగించి, ఏడాది పాటు జైలు శిక్ష విధించాలని తీర్పునిచ్చింది.


Next Story