ఒడిశా ప్రమాద స్థలిలో అనూహ్య ఘటన.. మీడియా ముందే CM, కేంద్రమంత్రి వాగ్వివాదం!

by Disha Web Desk 19 |
ఒడిశా ప్రమాద స్థలిలో అనూహ్య ఘటన.. మీడియా ముందే CM, కేంద్రమంత్రి వాగ్వివాదం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశా రైలు ప్రమాద ఘటన స్థలంలో శనివారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించడానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ- రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వాగ్వివాదానికి దిగడం కలకలం రేపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్యపై సీఎం, కేంద్రమంత్రి వాదులాడుకున్నారు. మమతా బెనర్జీ చెప్పిన మరణాల సంఖ్యను అశ్విని వైష్ణవ్ తోసిపుచ్చారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మమతా బెనర్జీ- రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 500లకు పైగా ఉండొచ్చని అన్నారు. ఈ మేరకు తనకు సమాచారం అందిందని పేర్కొన్నారు.

దీంతో, ఆమె పక్కనే నిల్చుని ఉన్న అశ్విని వైష్ణవ్- దీన్ని తప్పుపట్టారు. మమత బెనర్జీ చెప్పిన మృతుల సంఖ్య పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతమంది మరణించలేదని తేల్చి చెప్పారు. అధికారికంగా మరణించిన ప్రయాణికులు 238గా నిర్ధారించామని పేర్కొన్నారు. దీనికి మమతా బెనర్జీ బదులిస్తూ- మూడు కోచ్‌లలో రెస్క్యూ పని ఇంకా పూర్తి కాలేదని, అందువల్ల మరణాల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తోన్నానని అన్నారు. ప్రమాద స్థలంలో సీఎం, కేంద్రమంత్రి వాదులాడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed