'మేము హిందువులం కాదా..?'.. బీజేపీని ప్రశ్నించిన అశోక్ గెహ్లాట్

by Disha Web Desk 13 |
మేము హిందువులం కాదా..?.. బీజేపీని ప్రశ్నించిన అశోక్ గెహ్లాట్
X

జైపూర్: హిందుత్వానికి, ఓట్లకు బీజేపీ లింకు పెడుతోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఆ పార్టీకి ఓటు వేయని వాళ్లంతా హిందువులు కాదా..? అని ఆయన ప్రశ్నించారు. ‘మీరు (బీజేపీ) మతం పేరుతో ఏదో ఒక అంశంతో ప్రజలను రెచ్చగొడుతుంటారు. అందరూ హిందువులే. మేము హిందువులం కాదా? బీజేపీకి ఓటు వేసిన వాళ్లు హిందువలని ఎక్కడ రాసి ఉంది?’ అని గెహ్లాట్ అడిగారు. రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారాలో హల్దీఘటి యూత్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు అభివృద్ధి కావాలో లేక ప్రజలను రెచ్చగొట్టే అంశాలు కావాలో నిర్ణయించుకోవాలన్నారు.

‘ప్రజాస్వామ్య వ్యవస్థలో కొందరు బీజేపీకి ఓటేస్తారు.. కొందరు వెయ్యరు. కొందరు కాంగ్రెస్‌కు ఓటేస్తారు. కొందరు వెయ్యరు. బీజేపీకి ఓటెయ్యని వాళ్లు హిందువులు కాదన్న నిర్వచనాన్ని వీళ్లు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు..? ఇది దేశ ప్రయోజనాలకు కోసం కాదు’ అని గెహ్లాట్ చెప్పారు. రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలను నిలిపివేస్తుందని ఆయన ఆరోపించారు. ఐటీ రంగంలో రాజస్థాన్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఆయన అన్నారు.



Next Story

Most Viewed