Anurag Thakur: హిమాచల్ ప్రభుత్వం ఉద్యోగులను హింసిస్తోంది.. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్

by vinod kumar |
Anurag Thakur: హిమాచల్ ప్రభుత్వం ఉద్యోగులను హింసిస్తోంది.. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులను హింసిస్తోందని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. 600 పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులను ప్రారంభించిన ప్రభుత్వం వేతనాలు ఎందుకు ఇవ్వలేకపోతుందని ప్రశ్నించారు. బుధవారం ఆయన హమీన్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. ప్రభుత్వం తన స్నేహితులకు ప్రయోజనం చేకూరుస్తోందని, ఉద్యోగులను మాత్రం వేధిస్తోందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇంత సంక్షోభ పరిస్థితులు ఎన్నడూ చూడలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని చెప్పిన సుఖూ ఇఫ్పుడు ఎందుకు సంక్షోభంలో కూరుకుపోయిందో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ పాలసీలను మార్చుకోవాలని సూచించారు.

Advertisement

Next Story