ముగిసిన రిసెప్షనిస్టు అంకిత బండారి అంత్యక్రియలు

by Disha Web Desk 21 |
ముగిసిన రిసెప్షనిస్టు అంకిత బండారి అంత్యక్రియలు
X

డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లో సంచలనంగా మారిన 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకిత బండారి హత్య కేసులో ఆదివారం కూడా నిరసనలు హోరెత్తాయి. వివాదస్పదంగా మారిన రిసార్టు వ్యవహారంలో ఎలాంటి తనిఖీలు చేపట్టకుండానే కూల్చివేత చేపట్టడం ఏంటని అంకిత తండ్రి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆదివారం కూడా పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపై చేరి అంకిత మరణానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనపై ప్రత్యేక విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చేపడుతామని హామీ ఇచ్చారు.

ఈ క్రమంలో గవర్నర్ గుర్మీత్ సింగ్‌తో సమావేశమై నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామని సమాచారమిచ్చారు. తుది పోస్టుమార్టం నివేదికను బహిర్గతం చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ హామీతో చివరికి అంత్యక్రియలకు అంకిత తండ్రి అంగీకరించారు. ఆదివారం సాయంత్రం దహన సంస్కారాలు నిర్వహించారు. తాను పనిచేసే రిసార్టు యజమాని పులకిత్ ఆర్య చేతిలోనే దారుణ హత్యకు గురైంది.


Next Story

Most Viewed