కర్ణాటక ప్రభుత్వానికి అనూహ్య పరిణామం.. షాక్‌లో సీఎం

by Disha Web Desk 2 |
కర్ణాటక ప్రభుత్వానికి అనూహ్య పరిణామం.. షాక్‌లో సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 136 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నేతలు పలు కీలక హామీలు ఇచ్చారు. అందులో ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో విద్యుత్ బిల్లులు చెల్లించబోమంటూ ప్రజలు మొండికేస్తున్నట్లు సమాచారం.

అంతేగాక, బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు టికెట్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కండక్టర్లకు, మహిళా ప్రయాణికులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన కన్నడ ప్రభుత్వం పరిస్థితి చేదాటకముందే కొన్ని కీలక హామీలు అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ‘మహిళా శక్తి’ పథకాన్ని వెంటనే అమలు చేసేలా ఆదేశించాలని KSRTC సిబ్బంది సమాఖ్య సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసింది.

Next Story

Most Viewed