కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా

by Mahesh |
కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా
X

దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి అమిష్ షా భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ కొత్త కేబినెట్‌లో అమిత్ షా వరుసగా రెండోసారి కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 నుంచి కేంద్ర హోంమంత్రి గా కొనసాగుతున్న షా.. మోదీ కేబినెట్‌లో అదే మంత్రిత్వ శాఖను కొనసాగించారు. అలాగే ఆయన సహకార మంత్రిత్వ శాఖ మంత్రిగా కూడా ఈ రోజు బాధ్యతలు తీసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన నగరంలోని చాణక్యపూరి ప్రాంతంలోని నేషనల్ పోలీస్ మెమోరియల్‌ని సందర్శించారు. దేశానికి సేవ చేస్తూ తమ ప్రాణాలను అర్పించిన పోలీసులకు నివాళులర్పించారు.

హోం మంత్రిగా తాజా పదవీకాలంలో, కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్యా అధినియమం 2023 మూడు క్రిమినల్ చట్టాల అమలుకు షా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కాగా ఈ కొత్త చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అమిత్ షా తన చివరి పదవీకాలంలో ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (CAA) కీలక విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈసారి హోంమంత్రి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఇది చట్టపరమైన చట్రంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.



Next Story

Most Viewed