బీజేపీ 305 సీట్లు గెలుస్తుంది.. అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్

by Harish |
బీజేపీ 305 సీట్లు గెలుస్తుంది.. అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం జరుగుతున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 305 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్, గ్లోబల్ పొలిటికల్ రిస్క్ కన్సల్టెంట్ ఇయాన్ బ్రెమ్మర్ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రపంచ రాజకీయ దృక్కోణంలో భారతీయ ఎన్నికలు స్థిరంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జరిగే ఎన్నికలతో పోలిస్తే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలు అత్యంత సున్నితమైనవి, భారత రాజకీయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. స్వేచ్ఛ, న్యాయం కోసం పారదర్శకంగా జరిగే ఎన్నికలు నిజంగా అద్భుతమని ఇయాన్ భారతీయ ఎన్నికల ప్రక్రియను ప్రశంసించారు.

ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ, యురేషియా గ్రూప్ పరిశోధనలు బీజేపీ 295-315 సీట్లు గెలుస్తుందని సూచిస్తున్నాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టీ, వరుసగా మూడోసారి అధికారంలోకి రాబోతుంది. బీజేపీ ఈసారి హ్యాట్రిక్‌ కొట్టబోతుంది. 305 కంటే ఎక్కువ సీట్లు ఆ పార్టీ గెలుచుకుంటుందని అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ చెప్పారు.

భారతదేశ ఆర్థిక భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, గత కొన్ని దశాబ్దాలుగా భారత్ పనితీరు తక్కువగా ఉందని ప్రపంచం భావించింది. అయితే ఇప్పుడు దీని వృద్ధిని ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇక్కడ అద్భుతమైన జనాభా ఉంది. వారిలో చాలా మంది మేధావులు ఉన్నాయి. అమెరికాతో పాటు, గ్లోబల్‌గా ఉన్నటువంటి టాప్ కంపెనీలకు సీఈఓలుగా ఉన్నవారు భారత్‌కు చెందినవారే. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉంది. అలాగే, 2028 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని ఇయాన్ బ్రెమ్మర్ అన్నారు.

Next Story

Most Viewed