మోడీతో భేటీ గురించి బిల్ గేట్స్ ఏమన్నారంటే..?

by Dishanational6 |
మోడీతో భేటీ గురించి బిల్ గేట్స్ ఏమన్నారంటే..?
X

దిశ, నేషనల్ బ్యూరో: మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో ప్రధాని మోడీ బేటీ అయ్యారు. దేశరాజధాని ఢిల్లీలో ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. మోడీతో భేటీ అవ్వడం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం అని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నట్లు తెలిపారు. ప్రజాప్రయోజనాల గురించి మాట్లాడుకున్నామన్నారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్యం, వాతావరణ అనుకూలతలో ఆవిష్కరణల వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. మోడీతో ఉన్న ఫొటోను బిల్ గేట్స్ సోషల్ మీడియోలో షేర్ చేశారు.

బిల్ గేట్స్ ట్విట్ రీ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ. పలు రంగాలు, అంశాలపై బిల్ గేట్స్ తో జరిపిన సంభాషణ చిరస్మరణీయమని అన్నారు ప్రధాని. బిల్ గేట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సాధికారత పొందుతున్నారని అన్నారు.

కాగా.. బిల్ గేట్స్ భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సహా కేదంరమంత్రులు జైశంకర్, మన్ సుఖ్ మాండవీయాలతో భేటీ అయ్యారు. గేట్స్ ఫౌండేషన్ ఇండియా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తమ భాగస్వామ్యాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కేంద్రమంత్రి స్మృతిఇరానీ కూడా బిల్ గేట్స్ పై ప్రశంసలు కురిపించారు.


Next Story

Most Viewed