హలో నేను మీ జయలలితను.. ఈ సాంకేతికతకు ధన్యవాదాలు

by Shamantha N |
హలో నేను మీ జయలలితను.. ఈ సాంకేతికతకు ధన్యవాదాలు
X

దిశ, నేషనల్ బ్యూరో:తమిళనాడు మాజీ సీఎం జయలలిత 76వ జయంతి సందర్భంగా ఏఐఏడీఎంకే జనరల్‌ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి, సీనియర్ నేతలు, కార్యకర్తలు అమ్మకు నివాళులర్పించారు. అమ్మ జయంతి రోజున వినూత్న ప్రదర్శన చేపట్టింది అన్నా డీఎంకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన వాయిస్ క్లిప్ ను పార్టీ కార్యాలయంలో ప్రదర్శించారు. ఏఐ వాయిస్ క్లిప్ లో అచ్చం జయలలితనే పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినట్లు ఉంది.

ఆ ఏఐ క్లిప్‌లో “హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా. మీతో మాట్లాడే అవకాశాన్ని కల్పించిన ఈ సాంకేతికతకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. మేం అధికారంలో ఉన్నప్పుడు మహిళలు, విద్యార్థినుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం.

ఇప్పుడు.. ఓవైపు మనకు ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు అవినీతితో కూడిన పనికిరాని ప్రభుత్వం ఉంది. నా పుట్టినరోజు సందర్భంగా అన్నాడీఎంకే 'ప్రజా ప్రభుత్వం' మళ్లీ రావాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను.

మా కార్యకర్తలు నా బాటలో నిలబడాలి. సోదరుడు ఎడప్పాడి కె పళనిస్వామి బలోపేతం చేయాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మేము ప్రజల కారణంగా ఉన్నాం. ప్రజల కోసం ఉన్నాం” అని జయలలిత ఏఐ ప్రసంగం ఉంది.

జయలలిత ఏఐ వాయిస్ విన్న కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. ఎడప్పాడి పళనిస్వామి 2022లో అన్నాడీఎంకేకు నాయకత్వం వహిస్తున్నారు. పన్నీర్ సెల్వాన్ని పార్టీ నుంచి తొలగించినప్పట్నుంచి పళనిస్వామి పార్టీ చీఫ్ గా కొనసాగుతున్నారు.



Next Story

Most Viewed