రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. అందుబాటులోకి కొత్త సేవలు

by Disha Web Desk 14 |
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. అందుబాటులోకి కొత్త సేవలు
X

దిశ, వెబ్‌డెస్క్: పీఎం కిసాన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కొత్తగా ఏఐ చాట్‌బాట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కైలాశ్ చౌదరీ ఈ సేవలను ఇటీవల ప్రారంభించారు. ఈ ఛాట్‌బాట్ ద్వారా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అన్ని వివరాలను రైతులు సులువుగా తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ దరఖాస్తు ప్రక్రియ, అప్లికేషన్ స్టేటస్, లబ్ధిదారుల జాబితా, పేమెంట్ స్టేటస్ వంటి సమాచారం పొందోచ్చు.

ఇప్పటికే పీఎం కిసాన్ మొబైల్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఏఐ చాట్‌బాట్ సేవలు పొందవచ్చు. దేశంలోని అనేక ప్రాంతీయ బాషల్లో ఏఐ చాట్‌ఛాట్ సర్వీసులు లభిస్తాయి. త్వరలోనే 15వ విడత పీఎం పీఎం కిసాన్ నగదను రైతుల బ్యాంకు అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వం జమ చేయనుందని తెలుస్తోంది. ఈ పథకం కింద ప్రతీ ఏడాది రూ.6 వేలను రైతులకు ప్రభుత్వం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా వీటిని జమ చేస్తోంది. పెట్టుబడి సాయం కూడా వీటిని 5 ఎకరాల్లోపు పోలం కలిగిన రైతులకు పీఎం కిసాన్ నగదు ఇస్తోంది.

Next Story

Most Viewed