అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం వాయిదా.. ఎందుకంటే?

by Shamantha N |
అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం వాయిదా.. ఎందుకంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇవాళ జరగాల్సిన అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. ఏపీ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం జరగాల్సి ఉంది. అయితే, ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్యలు రావడంతో ఇస్త్రో శాస్త్రవేత్తలు రాకెట్ లాంఛ్ ని వాయిదా వేశారు. దీంతో నాలుగోసారి రాకెట్ ప్రయోగం వాయిదా పడినట్లయ్యింది. చెన్నైకి చెందిన ప్రైవేటు స్టార్టప్‌ కంపెనీ అగ్నికుల్‌ కాస్మోస్‌ ఏరోస్పేస్‌ సంస్థ అగ్నిబాణ్‌ సబ్‌ ఆర్బిటాల్‌ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్‌ రాకెట్‌ ప్రతిష్ఠత్మాకంగా రూపొందించింది. సొంత లాంఛ్ ప్యాడ్‌ ఏర్పాటుచేసి సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో శాటిలైట్ ని ప్రవేశపెట్టాలనుకున్నది. షెడ్యూల్‌ ప్రకారం 8 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత మంగళవారం ఉదయం 5.48 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. అయితే, సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషయంలో ప్రయోగాన్ని నిలిపివేశారు. ఆటోమేటెడ్ లాంఛ్ సీక్వెన్స్ ప్రారంభానికి సెకను ముందు ప్రయోగాన్ని నిలిపివేసినట్లు అగ్నికుల్ సంస్థ తెలిపింది. ప్రయోగం వాయిదా పడినందుకు నిరుత్సాహంగా ఉందని.. కానీ ఆటోమేటెడ్ లాంఛ్ సీక్వెన్స్ పనితనం చూస్తే సంతోషంగా ఉందని పేర్కొంది.

Next Story

Most Viewed