పీఎఫ్ఐకు ట్విట్టర్ షాక్.. నిలిపివేయాలని కేంద్రం ఆదేశం..

by Dishanational4 |
పీఎఫ్ఐకు ట్విట్టర్ షాక్.. నిలిపివేయాలని కేంద్రం ఆదేశం..
X

న్యూఢిల్లీ: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) తన అధికారిక ట్విట్టర్ ఖాతాను గురువారం నిలిపివేసింది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, టెర్రర్ ఫండింగ్ చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పీఎఫ్ఐ, ఎనిమిది అనుబంధ సంస్థలను ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే సోషల్ మీడియా ఖాతాలు, వెబ్‌సైట్లను కూడా నిలిపివేయాలని పేర్కొంది.

ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ ఖాతాను నిలిపివేసింది. కాగా, ఉగ్రవాద సంస్థలతో కొనసాగిస్తోందన్న ఆరోపణలో పీఎఫ్ఐపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. దీనికి సంబంధించిన కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేసింది.


Next Story

Most Viewed