ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత జట్టుకు స్పాన్సర్ గా అదానీ గ్రూప్

by Shamantha N |
ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత జట్టుకు స్పాన్సర్ గా అదానీ గ్రూప్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్యారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో పాల్గొనే భారత ప్లేయర్ల జట్టుకు ప్రధాన స్పాన్సర్ గా అదానీ గ్రూప్ వ్యవహరించనుంది. ఈ విషయాన్ని అదానీ గ్రూప్ సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదనీ ప్రకటించారు. క్రీడాకారులకు తమ మద్దతు పూర్తిస్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. క్రీడాకారుల కోసం #DeshkaGeetAtOlympics పేరుతో వారికి మద్దతుగా ప్రచారం ప్రారంభించామన్నారు. వారి కోసం ఓ వీడియోను కూడా రూపొందించారు. ఇకపోతే, ఈనెల 26 నుంచి ఆగస్టు 11 వరకు ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి భారత్ తరఫున పోటీలోకి దిగే అథ్లెట్ల సంఖ్య తగ్గిపోయింది. టోక్యో ఒలింపిక్స్ లో 124 మంది బరిలో నిలవగా.. ఈసారి మాత్రం 113 మంది అథ్లెట్లు మాత్రమే పోటీ పడుతున్నారు.

Next Story