బెంగాల్ హత్యాచార ఘటనపై నటి రౌద్ర నృత్యం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-09-18 13:20:13.0  )
బెంగాల్ హత్యాచార ఘటనపై నటి రౌద్ర నృత్యం
X

దిశ వెబ్ డెస్క్ : కోల్ కతా ఆర్జీకర్ ఆసుపత్రి వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనను నిరసిస్తూ, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బెంగాల్ లో నిరసనల పర్వం కొనసాగుతోంది. ఆందోళనకారులు రకరకాల రూపాల్లో తమ నిరసనలు కొనసాగిస్తున్న క్రమంలో నటి, డ్యాన్సర్ మోక్షా సేనుగుప్తా చేసిన నృత్య ప్రదర్శన వైరల్ గా మారింది. ఓ ఎన్జీవో సంస్థ దక్షిణ కోల్ కతాలో నిర్వహించిన వీధి ప్రదర్శనలో నటి మోక్షా ఆర్జీకర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ కాళీ మహోగ్ర రూపాన్ని తలపించేలా ఆవేశంగా చేసిన రౌద్ర నృత్యం నెట్టింటా వైరల్ గా మారింది. బెంగాల్ కే చెందిన మోక్ష తొలుత ఉపాధ్యాయురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం నటనపై ఆసక్తితో బెంగాలీ, దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో నటిగా ఎదుగుతున్నారు. హత్యాచార ఘటనపై తన డ్యాన్స్ వైరల్ గా మారడంపై స్పందించిన మోక్షా తాను హైదరాబాద్ లో సినిమా ప్రమోషన్ కోసం ఉన్న సమయంలో ఆర్జీకర్ హత్యాచార ఘటన సమాచారం తెలిసిందని, వెంటనే మా స్వగ్రామానికి వెళ్ళి నిరసనల్లో పాల్గొన్నానని, ఒక కళాకారిణిగా నిరసనకు వీధి ప్రదర్శనను ఎంచుకున్నానని తెలిపారు. తన కళ ద్వారా సామాన్యుల సమస్యలను వినిపించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు.

Advertisement

Next Story