తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు నటి కస్తూరి

by Mahesh |
తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు నటి కస్తూరి
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ప్రజలపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరి(Actress Kasthuri) పరారీలో ఉన్నట్లు తమిళనాడు పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారం క్రితం.. బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ హిందూ మక్కల్‌ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఆమె తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెలుగు సంఘాలు, ప్రముఖులు స్థానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. చెన్నై ఎగ్మోర్‌(Chennai Egmore)లో ఉన్న తెలుగు(Telugu) సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో సమన్లు ఇవ్వడానికి పోలీసులు శనివారం పోయెస్‌ గార్డెన్‌లోని కస్తూరి ఇంటికి వెళ్లారు.

ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె సెల్‌ నంబరుకు ఫోన్‌ చేశారు. స్విచాఫ్‌ అని రావడంతో పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయడంతో.. పరారీలో ఉన్న కస్తూరి.. అప్రమత్తం అయ్యారు. ముందస్తు బెయిల్ కోసం(anticipatory bail) మధురై కోర్టు(Madurai Court)లో పిటిషన్ వేశారు. కాగా ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. తన పిటిషన్ లో.. తాను చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణలు చెప్పానని.. అయినా.. ఉద్దేశపూర్వకంగా కేసులు వేశారన్న కస్తూరి పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed