నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు మరోసారి ఈడీ సమన్లు

by Shamantha N |
నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు మరోసారి ఈడీ సమన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీటౌన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈడీ మరోసారి సమన్లు పంపింది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జాక్వెలిన్ కు బుధవారం ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారిగా నటిస్తూ సుకేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్లు దోపిడీకి పాల్పడ్డాడు. ఈ కేసులో అరెస్టయిన సుకేశ్‌ చంద్రశేఖర్‌ ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. కాగా, ఇదే కేసులో జాక్వెలిన్ ను గతంలోనూ ఈడీ విచారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుఖేశ్ తో జాక్వెలిన్ కు గల సంబంధాల గురించి ప్రశ్నించింది. జాక్వెలిన్‌కు సుకేశ్‌ చంద్రశేఖర్ విలువైన ఆభరణాలు, వస్తువులను బహుమతిగా ఇచ్చాడని ఆరోపణలున్నాయి. జాక్వెలిన్ కు బహుమతులు ఇచ్చేందుకు ఈ నేర ఆదాయాన్ని వాడినట్లు ఈడీ ఆరోపించింది. క్రిమినల్ కేసుల్లో సుఖేష్ చంద్రశేఖర్ ప్రమేయం గురించి జాక్వెలిన్ కు ముందే తెలుసని అధికారులు అంటున్నారు. సుఖేష్ కు గతంలోనే వివాహం అయినప్పటికీ.. ఆర్థిక లాభం కోసం అతడితో సన్నిహితంగా మెలిగిందని ఆరోపిస్తున్నారు.

Next Story

Most Viewed