ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు దేవుని హెల్ప్ కోరిన యువతి

by Hajipasha |
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు దేవుని హెల్ప్ కోరిన యువతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో సంప్రదాయాలు కలిగిన భారతదేశంలో దేవుణ్ణి పూజించే ప్రజలే ఎక్కువగా కనిపిస్తారు. అందులో కొందరు.. కుటుంబ సమస్యలు పరిష్కరించమని దేవుడి ఆశీస్సులు కోరుకుంటే.. మరికొందరు మాత్రం లెటర్స్ రాసి దేవుని హుండీలో వేస్తారు. ఇది సాధారణ విషయం అయినప్పటికీ ఓ మహిళ రాసి దేవుని హుండీలో వేసిన లెటర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

ఒడిషా రాష్ట్రం సంబల్ పూర్‌లోని సామలేశ్వరి ఆలయంలోని హుండీని ఆలయ పెద్దలు తెరిచారు. ఆపై అందులో ఉండే నగదు, ఆభరణాలను ఒక వైపు తీసి.. అందులో ఉండే కొన్ని లెటర్‌లను చూశారు. అనంతరం ఒక లెటర్‌లో ఓ యువతి రాసిన లెటర్ చూసి ఆలయ పెద్దలు ఆశ్చర్యపోయారు. ఇక ఆ యువతి రాసిన లేఖలో '' జై మా సమలేయ్. అమ్మా నా ప్రార్థనలను దయచేసి ఆలకించు తల్లి. నా ఆశలు తీరుస్తావనే నీ దగ్గరకు వచ్చాను. అందరి సమక్షంలో రవీంద్రతో నా ప్రేమ వివాహం చేసుకోవడానికి నాకు సహాయం చేయ్యు తల్లి'' అని లేఖలో ఉంది. దీంతో ఈ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Next Story

Most Viewed