బ్రేకింగ్: సాయంత్రం 6:30 గంటలకు కేబినెట్ ప్రత్యేక సమావేశం

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: సాయంత్రం 6:30 గంటలకు కేబినెట్ ప్రత్యేక సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ స్పెషల్ సెషన్ జరగుతుండగానే.. ఇవాళ కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన పార్లమెంట్ భవనంలోనే కేబినెట్ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై కేబినెట్ చర్చించనుంది. అంతేకాకుండా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే కొత్త బిల్లులకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఓ పక్కా పార్లమెంట్ స్పెషల్ కొనసాగుతుండగానే.. మరోపక్కా కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుండటం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీలో కేంద్ర మంత్రి మండలి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుదనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 20వ తేదీన కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్న వేళ.. ఇవాళ్టి కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story