బిహార్‌లో ఎన్డీయేకు షాక్: కూటమికి ఆర్ఎల్జీపీ గుడ్‌బై!

by Dishanational2 |
బిహార్‌లో ఎన్డీయేకు షాక్: కూటమికి ఆర్ఎల్జీపీ గుడ్‌బై!
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికల వేళ బిహార్‌లో ఎన్డీయే కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్‌ఎల్‌జేపీ) అధ్యక్షుడు పశుపతి పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. బిహార్‌లో ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న పరాస్ లోక్‌సభ ఎన్నికలకు సీట్ల కేటాయింపుకు సంబంధించి ఆయన మేనల్లుడు చిరాగ్ పాశ్వాన్‌కి చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కు బీజేపీ ఐదు లోక్ సభ సీట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలోనే పరాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాజీనామా అనంతరం పరాస్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎన్డీయేలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో నిజాయితీగా పని చేసినప్పటికీ సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని తెలిపారు. అందుకే కేంద్ర మంత్రి పదవికి రిజైన్ చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి పెద్ద నాయకుడని, అయితే మా పార్టీకి, వ్యక్తిగతంగా అన్యాయం జరిగిందని చెప్పారు. దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు. లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పవన్ మరణం తర్వాత ఆయన కుమారులు చిరాగ్, పరాస్‌ల మధ్య విభేదాలు తలెత్తడంతో 2021లో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీగా రెండు వర్గాలుగా చీలిపోయింది.

ఆర్జేడీతో టచ్‌లోకి పరాస్!

ఎన్డీయేకు గుడ్ బై చెప్పానున్న పశుపతి పరాస్ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో టచ్‌లో ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఆర్జేడీ నేతలతో ఆయన సంప్రదింపులు జరిపిటనట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. ఐదు లోక్ సభ సీట్లు ఆర్ఎల్జీపీకి ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్టు సమాచారం. అయితే హజీపూర్ స్థానం నుంచి పోటీ చేస్తానని పరాస్ ఇటీవల పలు మార్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన అదే స్థానం నుంచి 2019లో ఎంపీగా గెలుపొందారు. దీంతో ఈ సీటును పరాస్‌కు కేటాయించేందుకు ఆర్జేడీ అంగీకరించినట్టు తెలుస్తోంది.

కాగా, బిహార్‌లోని 40 స్థానాలకు గాను సీట్ల పంపకంపై ఎన్డీయే కూటమి సీట్ షేరింగ్‌ను ప్రకటించింది. దీని ప్రకారం బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 ఎల్ జేపీ (రామ్ విలాస్) ఐదు స్థానాల్లో పోటీ చేస్తుంది. జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తాన్ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. ఇందులో లోక్ జనశక్తి పార్టీ (ఆర్‌ఎల్‌జేపీ)కి ఒక్కో స్థానం కూడా దక్క లేదు. దీంతో పరాస్ అసంతృప్తికి గురైనట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Next Story