Army chief: లెబనాన్ పేజర్ల పేలుడుపై భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు

by Shamantha N |
Army chief: లెబనాన్ పేజర్ల పేలుడుపై భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్ లో పేజర్ల పేలుడు విషయంపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(Army chief Gen Upendra Dwivedi) స్పందించారు. లెబనాన్ లో పేజ‌ర్ల‌ను బాంబులుగా మార్చింది ఇజ్రాయిల్‌ అని గుర్తుచేశారు. మ‌రి ఇలాంటి ఘ‌ట‌న‌ ఇండియాలో జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ఏం చేయాల‌న్న ప్ర‌శ్న‌కు జ‌న‌ర‌ల్ ద్వివేది స‌మాధానం ఇచ్చారు. ఆ పేజ‌ర్లు తైవాన్ కంపెనీకి చెందిన‌వ‌ని, కానీ వాటిని హంగేరీ కంపెనీకి స‌ర‌ఫ‌రా చేశార‌ని, హంగేరి కంపెనీ వాటిని లెబ‌నాన్‌కు పంపింద‌న్నారు. ఇజ్రాయిలీలు ఇలా ఓ షెల్ కంపెనీని క్రియేట్ చేసి.. హిజ్‌బొల్లాకు మాస్ట‌ర్‌స్ట్రోక్ ఇచ్చిన‌ట్లు వివరించారు. దీనికోసం చాలా ఏళ్ల ప్లానింగ్ పక్క అని గుర్తుచేశారు. ఈ ఘటన కోసం ఆ దేశం ఎన్నడో ప్లాన్ చేసిందన్నారు. మ‌నం పోరాడుతున్నప్పుడే యుద్ధం ప్రారంభం కాదు అని, మ‌నం ప్లానింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచే యుద్ధం మొద‌లైన‌ట్లు అవుతుంద‌ని ఆర్మీ చీఫ్ ద్వివేది అభిప్రాయ‌ప‌డ్డారు. అదే రణరంగంలో ముఖ్యమని అన్నారు. భారత్ కూడా సప్లయ్ చెయిన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క‌చ్చితంగా వేర్వేరు స్థాయిల్లో ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌న్నారు.

జమ్ముకశ్మీర్ లో 2 కోట్లమంది టూరిస్టులు

అమ‌ర్‌నాథ్ యాత్ర‌లో ఈసారి భ‌క్తుల సంఖ్య ఇప్ప‌టికే 5 ల‌క్ష‌లు దాటింద‌ని, జ‌మ్మూక‌శ్మీర్‌కు రెండు కోట్ల మంది టూరిస్టులు వ‌చ్చిన‌ట్లు ఉపేంద్ర ద్వివేది. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను మాత్ర‌మే రిక్రూట్ చేశార‌ని చెప్పుకొచ్చారు. గ‌తంలో ఈ సంఖ్య 300 వ‌ర‌కు ఉండేద‌న్నారు. వీట‌న్నింటినీ ప‌రిశీలిస్తే.. దేశం శాంతి, సామ‌ర‌స్యం దిశ‌గా అడుగులు వేస్తున్నట్లు కన్పిస్తోందన్నారు. ఉగ్ర‌వాదులు ఎక్కువ శాతం విదేశీయులే ఉన్నార‌ని అన్నారు. పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తేనే రాష్ట్రాలు నిలకడగా ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed