‘మహాదేవ్’యాప్ కేసులో కీలక పరిణామం

by Dishanational2 |
‘మహాదేవ్’యాప్ కేసులో కీలక పరిణామం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా రాయ్‌పూర్‌లోని స్పెషల్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. యాప్‌కు సంబంధించిన ఇద్దరు ప్రధాన ప్రమోటరర్లు రవి, సౌరబ్ చంద్రకర్‌లను దుబాయ్ నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈడీ ఆదేశాల మేరకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీచేయగా వీరిద్దరినీ ఇటీవల దుబాయ్‌లో అదుపులోకి తీసుకున్నారు.మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టు జనవరి 10న చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటుందని ఈడీ తరఫు న్యాయవాది సౌరభ్ పాండే తెలిపారు. కాగా, ఇదే కేసులో గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు దాస్, యాదవ్‌ అనే ఇద్దరిని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed