కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్‌కు తప్పిన భారీ ప్రమాదం(వీడియో)

by Harish |
కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్‌కు తప్పిన భారీ ప్రమాదం(వీడియో)
X

దిశ, నేషనల్ బ్యూరో: కేదార్‌నాథ్‌లో భారీ ప్రమాదం తప్పింది. ఆలయానికి భక్తులను తీసుకెళ్తున హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తెలత్తడంతో పైలట్‌ చాకచక్యంతో అత్యవసర ల్యాండింగ్ చేసి ప్రయాణికులను కాపాడారు. ఆరుగురు ప్రయాణికులు, పైలట్‌తో కూడిన హెలికాప్టర్ ఉదయం సిర్సీ హెలిప్యాడ్ నుండి ఆలయానికి బయలు దేరింది. అయితే కేదార్‌నాథ్ హెలిప్యాడ్‌కు దగ్గరగా వస్తున్న సమయంలో సడన్‌గా హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో సమీపంలోనే దాదాపు 100 మీటర్ల దూరంలో హెలిప్యాడ్ ఉన్నప్పటి హెలికాప్టర్‌‌ను అక్కడి వరకు పైలెట్ తీసుకెళ్లలేకపోయాడు. అప్పుడు అతను తెలివిగా దగ్గరగా ల్యాండింగ్‌కు అనుకూలంగా ఉండే ఖాళీ స్థలాన్ని వెతికి అక్కడే సురక్షింతగా ల్యాండింగ్ చేశాడు.

కొద్ది నిమిషాల సేపు తీవ్ర భయందోళనకు గురైన ప్రయాణికులు హెలికాప్టర్ సేఫ్‌గా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ ప్రాణాలను కాపాడినందుకు వారు పైలెట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హెలికాప్టర్ గాల్లోనే తిరుగుతుండడంతో క్రింద నేలపై ఉన్న వారు కూడా భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

రుద్రప్రయాగ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి మాట్లాడుతూ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా పైలెట్ అత్యవసర ల్యాండింగ్ చేశారని అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ సంవత్సరం, చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది, గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌తో సహా లుగు పుణ్యక్షేత్రాలలో మూడింటిని తెరవగా,మే 12న బద్రీనాథ్ తలుపులు తెరుచుకున్నాయి. ప్రస్తుతం భారీ సంఖ్యలో భక్తులు ఈ యాత్రకు వస్తున్నారు.

Next Story