విమానంలో అర్ధనగ్నంగా మహిళా వీరంగం.. అదే కావాలంటూ అసభ్యంగా..

by Disha Web Desk |
విమానంలో అర్ధనగ్నంగా మహిళా వీరంగం.. అదే కావాలంటూ అసభ్యంగా..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల విమాన ప్రయాణాలు వివాదస్పదంగా మారుతున్నాయి. ఫ్లైట్ ఎక్కిన ప్రయానికులు తోటి ప్రయాణికులు, సిబ్బంది పట్ల అసభ్యకరంగా, దురుసుగా ప్రవర్తిస్తూ విమర్శల పాలవుతున్నారు. ఇటీవల ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన మరవక ముందే తాజాగా మరో ప్రయాణికురాలు ఫ్లైట్‌లో అర్ధ నగ్నంగా తిరుగుతూ అసభ్యంగా ప్రవర్తించింది. సోమవారం విస్తారా విమానంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అబుదబీ నుంచి ముంబయి వస్తున్న విస్తారా విమానం ఎక్కిన ఓ మహిళ ఎకానమీ క్లాస్ టికెట్ తీసుకుని బిజినెస్ క్లాస్‌లో కూర్చుంటానని పట్టుబట్టింది. అయితే దానికి విస్తారా సిబ్బంది ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహం చెందిన సదరు మహిళ అర్ధనగ్నంగా మారి విమానంలో తిరగడం ప్రారంభించింది. వారించిన సిబ్బందిపై దాడికి దిగింది. దీంతో కెప్టెన్ వార్నింగ్ కార్డు జారీ చేసి ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విమానం ల్యాండ్ కాగానే పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన విస్తారా.. ''ప్రయాణికురాలి అసభ్య, హింసాత్మక ప్రవర్తన కారణంగా ఆమెను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఘటన గురించి ఎయిర్ పోర్టులో భద్రతా సిబ్బందికి సమాచారమిచ్చాం. వారు తగిన చర్యలు తీసుకున్నారు'' అని వివరణ ఇచ్చింది.


Next Story

Most Viewed