సొంత ముఠా చేతిలోనే హతమైన గ్యాంగ్ స్టర్

by samatah |
సొంత ముఠా చేతిలోనే హతమైన గ్యాంగ్ స్టర్
X

దిశ, నేషనల్ బ్యూరో: సొంత ముఠా సభ్యుల చేతిలోనే మహారాష్ట్రలోని పూణేకు చెందిన గ్యాంగ్‌స్టర్ శరద్ మోహోల్ హతమయ్యాడు. కొత్రుడ్‌లోని సుతార్ దారా ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం మొహోల్‌పై దుండగులు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. దీంతో గాయాలపాలైన అతనిని కోత్రూడ్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా..అప్పటికే పరిస్థితి విషమించి మృతి చెందాడు. గ్యాంగ్‌లో తలెత్తిన భూమి, డబ్బుకు సంబంధించిన వివాదమే హత్యకు కారణమని తెలుస్తోంది. కాల్పులకు పాల్పడినట్టు అనుమానిస్తున్న ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి మూడు పిస్టల్స్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తునకు ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, మోహోల్‌పై హత్య, దోపిడీకి సంబంధించిన పలు కేసులు ఉన్నాయి. ఈ ఘటనపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మొహోల్‌ను అతని అనుచరులే చంపారని ఇది గ్యాంగ్ వార్ కాదని అన్నారు. గ్యాంగ్‌స్టర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందనిహెచ్చరించారు.Next Story

Most Viewed