ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు.. భారత్ సాయంపై టర్కీ రియాక్షన్

by Disha Web |
ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు.. భారత్ సాయంపై టర్కీ రియాక్షన్
X

న్యూఢిల్లీ: భూకంపంతో అల్లకల్లోలంగా మారిన టర్కీకి భారత్ సాయం ప్రకటించడంపై టర్కీ అంబాసిడర్ ఫిరట్ సునెల్ స్పందించారు. టర్కీ వాడుకపదం దోస్తిగా పేర్కొంటూ భారత్‌ను నిజమైన స్నేహితుడని వర్ణించారు. భారత్ అందించిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు. చావు బతుకులకు సంబంధించిన విషయంలో భారత్ స్పందనకు అభినందనలు చెప్పారు. కాగా, భారత్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అత్యవసర ఆహారాలతో కూడిన రెండు సీ 17 విమానాలను టర్కీ పంపినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. భారత్ 100 మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అత్యంత నైపుణ్యం ఉన్న డాగ్ స్క్వాడ్స్, మెడిసిన్, డ్రిల్లింగ్ పరికరాలు, సహాయక చర్యలు చేపట్టేందుకు ఉపయోగించే ఇతర ముఖ్యమైన సాధనాలను పంపింది.


👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story