- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ధూమపాన ప్రియులకు భారీ షాక్.. సిగరెట్ల విషయంలో కొత్త నిబంధనలు..

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పొగాకు ఉత్పతుల వినియోగాన్ని, సిగరెట్ల వాడకాన్ని మరింత తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోబోతుంది. లూజ్ సిగరెట్ల విక్రయాలను నిషేధించాలంటూ 2019లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అంగీకారం తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో మంత్రి జేపీ నద్దా లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
''లూజ్ సిగరెట్లు లేదా సింగిల్ సిగరెట్ల అమ్మకంపై నిషేధం విధించాలని నిపుణుల కమిటీ సూచించింది. అలాగే సిగరెట్లు కొనేందుకు చట్టపరంగా కనీస వయసును కూడా పెంచింది. దాంతో పాటు పొగాకు ఉత్పత్తుల చట్టం, 2003 కింద సిగరెట్ల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చెల్లించాల్సిన జరిమానా మొత్తాన్ని కూడా పెంచింది. వాటన్నికి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది''. అయితే వీటిని అమలు చేయాలంటే ముందు పార్లమెంట్‌లో ఆ డ్రాఫ్ట్‌ను బిల్లు రూపంలో తీసుకువచ్చి ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. కాగా.. సిగరెట్ల విషయంలో కొత్తగా రాబోతున్న ఈ నిబంధనలు పొగాకు పరిశ్రమలపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read...
Unknown Facts : ఈ అలవాట్ల వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుందని తెలుసా ?