ఇంగ్లీషులో అదరగొట్టిన 60 ఏళ్ల ఆటో డ్రైవర్.. నోరెళ్లబెడుతోన్న నెటిజన్స్

by Anjali |
ఇంగ్లీషులో అదరగొట్టిన 60 ఏళ్ల ఆటో డ్రైవర్.. నోరెళ్లబెడుతోన్న నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ తాత ఫ్లూయెంట్ ఇంగ్లీషులో చించిపడేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ రోజుల్లో కూడా కొంతమంది ఇంగ్లీషు మాట్లాడడానికి తెగ ఇబ్బందిపడిపోతారు. ఇందుకోసం కోచింగ్ సెంటర్లకు వెళ్తారు. మరికొంతమంది ఇంట్లోనే తమ బ్రదర్, సిస్టర్ ద్వారా నేర్చుకుంటే.. మరికొంతమంది ఫోన్‌లో యూట్యూబ్ క్లాసెస్ విని నేర్చుకుంటారు. కానీ ఈ తాత మాట్లాడిన ఇంగ్లీషు చూస్తుంటే ఆ రోజుల్లో నేర్చుకున్నాడా? ఈ రోజుల్లో నేర్చుకున్నాడా? ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడురా బాబు అంటూ నెట్టింట జనాలు నోరెళ్లబెడుతున్నారు. మరీ ఈ తాత ఓ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగి కూడా కాదండోయ్. ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగించే సాధారణ వ్యక్తి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో అమరావతి నగరానికి చెందినది. తాత ఈ వీడియోలో ఏం చెప్పాడో చూద్దామా? ‘‘నేటి యువత ఇంగ్లీషు బాగా నేర్చుకోండి. ఆంగ్లంలో మాట్లాడటం వస్తే ఏ దేశానికన వెళ్లొచ్చు. లండన్ కు వెళ్లి, మరాఠీలో మాట్లాడతానంటే అక్కడి నుంచి వెళ్లిపోమ్మని అంటారు’’. అంటూ తాత స్పష్టమైన ఇంగ్లీషులో మాట్లాడుతూ యువతకు సలహా ఇచ్చారు. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు తాత ఇంగ్లీష్ సూపర్.. ఈ పెద్దాయన ఆంగ్లంలో మాట్లాడుతుంటే ఇంగ్లీషు నేర్చుకోవడం ఎంత ముఖ్యమో అర్థమౌతుందంటూ జనాలు తాతపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషలో మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

Next Story

Most Viewed