12 ఏళ్ల బాలుడిపై నలుగురు లైంగికదాడి

by Disha Web Desk 21 |
12 ఏళ్ల బాలుడిపై నలుగురు లైంగికదాడి
X

న్యూఢిల్లీ: దేశరాజధానిలో అమ్మాయిలపై మాత్రమే కాదు అబ్బాయిలపై కూడా అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. 12 ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. కర్రలతో కొట్టడంతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఢిల్లీ మహిళ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆదివారం ట్వీట్ చేశారు. ఢిల్లీ అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలకు రక్షణ లేకుండా పోయింది.

నలుగురు వ్యక్తులు 12ఏళ్ల బాలుడిపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా కర్రలతో తీవ్రంగా కొట్టడంతో చావుల బతుకుల మధ్య పోరాడుతున్నాడు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం' అని ట్వీట్‌లో స్వాతి పేర్కొన్నారు. గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఇప్పటివరకు ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


Next Story

Most Viewed