- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Telangana Assembly Election 2023
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
సాయుధ దళాల్లో 83 వేల ఖాళీలు.. వెల్లడించిన కేంద్రం
by Disha Web |

X
న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో 83 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. మంగళవారం లోక్‌సభలో కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మొత్తం 10,15,237 సామర్ధ్యానికి 83,127 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా జూలై-జనవరి మధ్యలో 32,841 మందిని రిక్రూట్ చేశారని అదనంగా 64,444 ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు చేసినట్లు పేర్కొంది. అయితే ఖాళీల భర్తీ అనేది నిరంతర ప్రక్రియ అని, కేంద్రం దానికి తగిన విధంగా నియామకాలు చేపడుతుందని మంత్రి చెప్పారు. కాగా, సాయుధ పోలీసు దళాల్లో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ(సశస్త్ర సీమ బల్) వస్తాయి.
Next Story