పార్టీ మారేందుకు మరో ఏడుగురు నేతలు సిద్ధం.. వెల్లడించిన లోక్ సభ సభ్యుడు..

by Dishafeatures2 |
పార్టీ మారేందుకు మరో ఏడుగురు నేతలు సిద్ధం.. వెల్లడించిన లోక్ సభ సభ్యుడు..
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో మరో తీవ్ర పరిణామం చోటు చేసుకోనుందని, మరో ఏడుగురు నేతుల ఏక్‌నాథ్ షిండే గ్రూప్‌లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని శివసేన లోక్ సభ సభ్యుడు కృపాల్ తుమానే బుధవారం వెల్లడించారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి ఇద్దరు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు త్వరలో షిండే ఫ్యాక్షన్‌లో చేరనున్నారని ఆయన తెలిపారు. కృపాల్ వ్యాఖ్యలతో ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో కొత్త అలజడి రేగింది. 'షిండే విధానాలను నమ్మే వారంతా తమంతట తామే ఫోన్ చేసిన పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు' అని కృపాల్ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం షిండే క్యాంప్‌లో సీఎంతో కలిపి 40 మంది ఎమ్మెల్యేలు, 12 మంది లోక్ సభ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు షిండే క్యాంపులో చేరేందుకు మరో ఏడుగురు నేతలు ఆసక్తి చూపుతున్నారన్న కృపాల్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. వారు కూడా వెళితే ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో నేతలు లేని పరిస్థితికి చేరుతుందని, అంతేకాకుండా రాష్ట్రంలో శివసేన తన అస్తిత్వాన్ని కోల్పోతుందని విశ్లేషకులు అంటున్నారు.


Next Story

Most Viewed