కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా.. 24 గంటల్లో 6,660 కేసులు నమోదు

by Disha Web Desk 12 |
కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా.. 24 గంటల్లో 6,660 కేసులు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: గత రెండు రోజులుగా కరోనా కేసులు కాస్త తగ్గాయి. సోమవారం కంటే ఈ రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7 శాతం తగ్గింది. దీంతో గడిచిన 24 గంటల్లో భారతదేశంలో మొత్తం 6660 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో 24 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,31,369కి పెరిగింది. అలాగే ప్రస్తుతం భారత్‌లో రోజువారీ సానుకూలత రేటు 3.52 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.Next Story