45 రోజుల్లో 6 వేల పోస్ట్‌లు భర్తీ అవుతాయి: సీఎం

by Dishafeatures2 |
45 రోజుల్లో 6 వేల పోస్ట్‌లు భర్తీ అవుతాయి: సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: 45 రోజుల్లో రాష్ట్రంలో 6 వేల పోస్ట్‌లు భర్తీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పంజాబ్‌లో అంగన్‌వాడీ వర్కర్లు తక్కువ సంఖ్యలో ఉన్నారని, వారి నియామకాలను వెంటనే చేపట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మన్ దీనిపై స్పందించారు. రానున్న 45 రోజుల్లో రాష్ట్రంలో 6 వేల అంగన్‌వాడీ వర్కర్ల ఖాళీలు భర్తీ అవతాయని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ నియామపక మద్దతి అంతా కూడా మెరిట్ ఆధారంగా సాగుతుందని, ఇందులో అవినీతి, లంచాలకు తావు ఉండదని సీఎం చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా దాదాపు 4,300 పంజాబ్ పోలీసుల ఖాళీలు కూడా భర్తీ అవుతున్నాయని, ఇందులో ఎన్నికైన వారికి త్వరలో అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు భగవంత్ మన్ శుక్రవారం ప్రకటించారు. అంతేకాకుండా తమ ప్రభుత్వం యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి కల్పిస్తుందని అన్నారు. దాంతో పాటుగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, మంత్రులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ నేతలు ప్రజల సంక్షేమం కోసం ప్రయత్నించకుండా, చట్టవిరుద్ధ దారుల్లో ఆస్తులు కూడబెట్టుకోవడంలో కష్టపడ్డారని భగవంత్ మన్ అన్నారు.

'ఈ నేతల దగ్గర కరెన్సీ నోట్లు ముద్రించే యంత్రాలు లేవు కానీ వీరు మాత్రం పెద్దపెద్ద ప్యాలెస్‌లు కట్టారు. అవన్నీ కూడా పన్ను కట్టే వారి నుంచి లాక్కుని కట్టినవే. ఈ చట్టవిరుద్ధమైన మరియు హేయమైన ఆచారం వారిని ధనవంతులను చేసింది కానీ ప్రజలకు కనీస పౌర సౌకర్యాలను కోల్పోయింది' అని భగవంత్ మన్ విమర్శించారు.

తగ్గిన ద్రవ్యోల్బణం జూలైలో 6.71శాతం నమోదు.


Next Story