ఆ ఇంటి బాత్ రూంలో 60 పాములు.. వాటిని చూసి..

by Disha Web Desk 4 |
ఆ ఇంటి బాత్ రూంలో 60 పాములు.. వాటిని చూసి..
X

దిశ, వెబ్‌డెస్క్: అసలు పాము పేరు వినపడితేనే భయంతో వణికిపోతాం. అదే పాము కనపడితే ఆమడ దూరం పరుగెడతాం. అలాంటిది ఒక ఇంట్లో ఏకంగా 60 పాములు నివాసం ఉంటున్నాయి. వినడానికి వింతగా ఉన్నా అక్షరాల ఇది నిజం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ముజఫర్ జిల్లా, ఖతాలీ గ్రామంలోని రంజిత్ సింగ్‌కు చెందిన ఇల్లు గతంలో అద్దెకు ఇచ్చాడు. కానీ ప్రస్తుతం అది శిథిలమైపోయింది. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరు ఉండటం లేదు. దీంతో ఆ ఇంటి బాత్‌రూమ్‌ను నివాసంగా మార్చుకున్నాయి పాములు. అయితే ఇంట్లోని పాములను చూసిన అక్కడి ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థాలానికి చేరుకుని గంటల తరబడి శ్రమించి.. 60 పాములను, 75 గుడ్ల పెంకులను స్వాధీనం చేసుకుని, అడవుల్లో వదిలేశారు. అయితే చుట్టు పక్కల సరైన డ్రైనేజీలు లేకపోవడం వల్ల ఎక్కువ సంఖ్యలో పాములు వచ్చాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.



Next Story