హిమాచల్ ప్రదేశ్ లో సంక్షోభంలో కాంగ్రెస్ ప్రభుత్వం!

by Shamantha N |
హిమాచల్ ప్రదేశ్ లో సంక్షోభంలో కాంగ్రెస్ ప్రభుత్వం!
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ పతనమయ్యే పరిస్థితి ఏర్పడింది. హిమాచల్ లో కాంగ్రెస్ మెజార్టీ కోల్పోయిందని బీజేపీ ప్రకటించింది. ఆ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు హర్యానాకు తరలించారని ఆరోపించారు సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు. కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను హర్యానా పోలీసులు, సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లో హర్యానాకు తరలించారని తెలిపారు. ఎమ్మెల్యేలను సంప్రదించేందుకు వారి కుటుంబాలు ప్రయత్నిస్తునాయని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ చేస్తున్న ఇలాంటి గూండాగిరిని హిమాచల్ ప్రదేశ్ ప్రజలు అంగీకరించని తెలిపారు సుఖ్విందర్.

హిమాచల్ ప్రదేశ్ లో ఏకైక రాజ్యసభ స్థానానికి జరిగిన పోలింగ్ లో క్రాస్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు చెరో 34 ఓట్లు పడగా.. డ్రాలో బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ గెలుపొందాడు. అలవోకగా గెలుస్తాడనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ పరాజయాన్ని మూటకట్టుకున్నాడు. కాంగ్రెస్ కు చెందిన ఆరుగులు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈనెల 29న సుఖ్విందర్ సర్కార్ పై అవిశ్వాస తీర్మనం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు బీజేపీ నేతలు. అవిశ్వాస తీర్మానం పెట్టే ప్లాన్ లో భాగంగానే ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాకు తరలించినట్లు తెలుస్తోంది. కాగా.. సీఎం సుఖ్విందర్ తీరుపై పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.



Next Story

Most Viewed