దేశంలో 50 శాతం గ్రామీణ కుటుంబాలకు నల్లా కనెక్షన్లు

by Disha Web |
దేశంలో 50 శాతం గ్రామీణ కుటుంబాలకు నల్లా కనెక్షన్లు
X

న్యూఢిల్లీ: గ్రామాల్లోని ప్రతి ఇంటికి సురక్షిత త్రాగు నీటిని అందించాలనే లక్ష్యంలో కేంద్రం మైలురాయిని అందుకుంది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతానికి చేరిందని జలశక్తి మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. 'గోవా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, దాదా అండ్ నగర్ హవేలీ డామన్ డయ్యూ, పుదుచ్చెరీ ఇప్పటికీ 100 శాతం చేరుకున్నాయి. గుజరాత్, పంజాబ్, హిమచల్ ప్రదేశ్, బీహార్‌లలో 90శాతానికి పైగా పూర్తయింది' అని పేర్కొంది. గ్రామ స్వరాజ్య దిశగా జల్ జీవన్ మిషన్ పంచాయతీ రాజ్ సంస్థలు, కమ్యూనిటీలకు అధికారాన్ని ఇచ్చే లక్ష్యంగా నీటి సరఫరా పథకాలను ముందు నుంచే ప్రొత్సహిస్తుంది. దీని ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 9.59 కోట్లకు పైగా గ్రామీణ ఇళ్లకు చేరుతుంది. కేంద్రం 'హర్ గర్ జల్' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో 2024 కల్లా గ్రామాల్లోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. శుక్రవారం వరకు 108 జిల్లాలు, 1,222 బ్లాకులు, 71,667 గ్రామ పంచాయితీలు, 1,51,171 గ్రామాలు హర్ గర్ జల్ లో భాగమయ్యాయి.


Next Story