విషాదం : అంతిమ యాత్రకు వెళ్తూ.. 50 మంది తిరిగిరాని లోకాలకు

by Dishanational6 |
విషాదం : అంతిమ యాత్రకు వెళ్తూ.. 50 మంది తిరిగిరాని లోకాలకు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆఫ్రికా దేశం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడి 50 మది చనిపోయారు. దీంతో అక్కడ విషాద ఛాయలు నెలకొన్నాయి. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బాంగూయ్‌లో ఈ ప్రమాదం జరిగింది. వారందరూ అంత్యక్రియలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంతో నదులపై ప్రయాణం కోసం భద్రతా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ప్రమాదం జరిగిన 40 నిమిషాల్లోనే తాము అప్రమత్తమయ్యామని అధికారులు చెప్పారు. రెస్క్యూ సిబ్బంది 50 డెడ్ బాడీలను వెలికి తీసినట్లు సివిల్ ప్రొటక్షన్ డిపార్ట్మెంట్ చీఫ్ థామస్ జిమాస్సే తెలిపారు. పోకో నదిలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు వివరించారు. నదిలో గల్లంతైన మరికొందరి కోసం గాలింపు జరుగుతున్నట్లు తెలిపారు.

ప్రమాద సమయంలో బోటులో 300 మంది వరకు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఓ గ్రామ పెద్ద చనిపోవడంతో బాంగూయ్‌కి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి అంత్యక్రియల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. ప్రమాదం తర్వాత రెస్క్యూ సిబ్బంది రావడానికి 40 నిమిషాలు పట్టింది. అప్పటికే అక్కడ ఉన్న లోకల్ బోట్లు, చేపలు పట్టేవారు ప్రజల్ని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.



Next Story

Most Viewed