Delhi-Kerala Train: కేరళలో ఘోర రైలుప్రమాదం.. నలుగురు మృతి

by Shamantha N |
Delhi-Kerala Train: కేరళలో ఘోర రైలుప్రమాదం.. నలుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ పైన పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపైనుంచి కేరళ ఎక్స్ ప్రెస్ (Kerala Express) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. పాలక్కాడ్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని షోరనూర్ వంతెన సమీపంలోని రైల్వే ట్రాక్‌పై కార్మికులు చెత్తను తొలగిస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శానిటేషన్ పనులు చేస్తున్న కార్మికుల పైనుంచి ఢిల్లీ-కేరళ ఎక్స్ ప్రెస్(Delhi-Kerala Train) దూసుకెళ్లింది. ఘటనా స్థలం నుంచి మూడు మృతదేహాలను వెలికి తీయగా, నాలుగో వ్యక్తిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా.. నాలుగో వ్యక్తి భరతపూజ నదిలోకి దూకి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులంతా తమిళనాడుకు చెందినవారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన రైలును కార్మికులు గమనించి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Next Story