పండుగవేళ ఘోర రోడ్డు ప్రమాదం... 25 మంది మృతి

by Disha Web |
పండుగవేళ ఘోర రోడ్డు ప్రమాదం... 25 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 25 మంది మృతిచెందగా, 21 మంది గాయపడ్డారు. పౌరీ గర్వాల్ జిల్లాలోని బీర్ ఖాల్ ప్రాంతంలో మంగళవారం రాత్రి పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఆ బస్సులో ప్రయాణిస్తున్నవారిలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

Next Story

Most Viewed