2024 కీలక పరీక్షల షెడ్యూల్ క్యాలెండర్ విడుదల

by Mahesh |
2024 కీలక పరీక్షల షెడ్యూల్ క్యాలెండర్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలోని కీలకమై పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) 2024 పరీక్ష క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2024 జనవరి-ఫిబ్రవరి, ఏప్రిల్‌లో రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు. అలాగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ లేదా NEET UG 2024 మే 5న జరుగుతుంది. JEE మెయిన్ మొదటి సెషన్ జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వరకు, రెండో సెషన్ ఏప్రిల్ 1, 15 మధ్య ఉంటుంది. ఇది IIITలు, NITలు ఇతర భాగస్వామ్య ఇంజనీరింగ్ కళాశాలలు అందించే అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశం కోసం JEE మెయిన్ నిర్వహించబడుతుంది. ఇది IIT JEE అడ్వాన్స్‌డ్‌కు అర్హత పరీక్షగా కూడా పనిచేస్తుంది. అలాగే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) UG మే 15, 31 మధ్య షెడ్యూల్ చేయబడింది. CUET PG మార్చి 11 నుంచి 28 వరకు ఉంటుంది. దీంతో పాటుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా UGC NET 2024 మొదటి సెషన్ జూన్ 10 నుంచి 21 వరకు నిర్వహించబడుతుంది.



Next Story

Most Viewed