గోద్రా అల్లర్ల కేసులో.. 8 మందికి బెయిల్ మంజూరు

by Disha Web Desk 13 |
గోద్రా అల్లర్ల కేసులో.. 8 మందికి బెయిల్ మంజూరు
X

న్యూఢిల్లీ: గోద్రా అల్లర్ల కేసులో ఎనిమిది మంది నిందితులకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘనలో 58 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దోషులుగా ఉన్న 31 మంది బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు 11 మందికి మరణ శిక్ష.. 20 మందికి జీవిత ఖైదు విధించింది. గుజరాత్ హై కోర్టు వారిపై వచ్చిన నేరారోపణలను సమర్థించింది.

కానీ, మరణశిక్షను తగ్గించింది. నరోదాగామ్ కేసులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే మాయా కొద్నానీ, బజరంగ్ దళ్ మాజీ నాయకుడు బాబు బజరంగ్, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) జయదీప్ పటేల్‌తో సహా మొత్తం 68 మంద నిందుతులను అహ్మదాబాద్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన మరుసటి రోజు సుప్రీం కోర్టు గోద్రా అల్లర్లపై విచారణ చేపట్టింది. నరోదాగామ్ కేసులో 11 మంది మరణించారు. నరోదాగామ్ ఘటనలో 67 ఏళ్ల కొద్నానీపై నేరపూరిత కుట్ర, హత్యాయత్నం అభియోగాలు ఉన్నాయి. 2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్లోని నరోదాగామ్‌లో జరిగిన మత హింసలో 11 మంది చనిపోయారు. గోద్రా రైలు దహనానికి నిరసనగా జరిగిన బంద్‌లో 58 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

Next Story

Most Viewed