- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
PM Modi: 14 ఏళ్లుగా చెప్పులు లేకుండా దీక్ష.. స్వయంగా బూట్లు తొడిగిన మోడీ.. ఎందుకంటే?

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ (PM Modi) హర్యాణా (Haryana) పర్యటనలో అరుదైన ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్లుగా చెప్పులు ధరించకుండా దీక్ష చేస్తున్న ఓ వ్యక్తికి.. మోడీ స్వయంగా బూట్లు గిఫ్ట్‌గా ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అంతేకాదు, బూట్లు తొడుక్కొనేందుకు సాయం కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అతడి దీక్షకు, మోడీకి సంబంధం ఏంటో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
హర్యాణా రాష్ట్రంలోని కైతాల్‌కు చెందిన రామ్‌పాల్ కశ్యప్ అనే వ్యక్తి ప్రధాని మోడీకి వీరాభిమాని. ఈ సందర్భంగా మోడీ ప్రధానమంత్రి అయ్యో వరకు, తాను ఆయనను కలిసే వరకు చెప్పులు వేసుకోనని రాంపాల్ 14 ఏళ్ల క్రితం దీక్ష చేపట్టారు. 2014లో మోడీ ప్రధాని అవ్వడంతో అతడి కోరిక నెరవేరింది. కానీ, మోడీని కలిసే అవకాశం రాలేదు. దీంతో ఆయనను కలిసిన తర్వాతే చెప్పులు వేసుకోవాలని ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని యమునానగర్‌లోని బహిరంగ సభ నేపథ్యంలో కశ్యప్‌కు ఫోన్ చేసి కలవమని అపాయింట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు, స్వయంగా బూట్లను బహుకరించి, ధరించామని కోరారు. భవిష్యత్తులో ఇలా చేయొద్దని కశ్యప్‌కు ప్రధాని సూచించారు. ఆ తర్వాత కశ్యప్ షూ ధరిస్తుంటే మోడీ ఆయనకు సహాయం చేశారు. దీంతో కశ్యప్ భావోద్వేగానికి గురయ్యారు.