NITI Aayog report : '13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారు'

by Disha Web Desk 13 |
NITI Aayog report : 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారు
X

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్ రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ ఘనతను 2016-2021 మధ్య కాలంలో సాధించినట్లు నీతిఆయోగ్ తెలిపింది. ‘నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్: ఎ ప్రోగ్రెస్ ఆఫ్ రివ్యూ-2023’ నివేదికను నీతిఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ సోమవారం విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం.. దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 2015-16లో 24.85% ఉంది. 2019-21లో అది 14.96%కు తగ్గింది. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలను ప్రజలు అందుకునే శక్తిని బట్టి పేదరికాన్ని లెక్కిస్తారు.

పేదరికం గ్రామాల్లో 32.59% నుంచి 19.28%కు తగ్గింది. పట్టణాల్లో 8.65% నుంచి 5.27%కు తగ్గింది. 2030 నాటికి దేశంలో పేదరికాన్ని సగానికి తగ్గించాలన్న లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నాం. పారిశుధ్యం, పోషకాహార వంట ఇంధనం, ఆర్థిక సమ్మేళనం, తాగునీరు, విద్యుత్తును అందరికీ అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధ్యమైందని నీతిఆయోగ్ పేర్కొన్నది. పేదరికాన్ని తగ్గించడంలో పోషకాహారంలో మెరుగుదల, పాఠశాల విద్య, పారిశుద్యం, వంట ఇంధనం ముఖ్యపాత్ర పోషించాయన్నది.



Next Story

Most Viewed