ఎన్డీఏ వర్సెస్ ఇండియా.. 7 రాష్ట్రాల్లో 13 చోట్ల బైపోల్స్

by Shamantha N |
ఎన్డీఏ వర్సెస్ ఇండియా.. 7 రాష్ట్రాల్లో 13 చోట్ల బైపోల్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే 7 రాష్ట్రాల్లోని 13 స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కొనసాగుతోంది. కాగా.. లోక్ సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ జరగుతోంది. ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్, మంగళూరు, పంజాబ్ లోని జలంధర్ వెస్ట్, హిమాచల్ ప్రదేశ్ లోని డెహ్రా, హమీర్‌పూర్, నలాగఢ్ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. బిహార్ లోని రూపాలి, పశ్చిమ బెంగాల్ లోని రాయ్‌గంజ్, రణఘాట్ సౌత్, బాగ్దా, మానిక్తలా, తమిళనాడులోని విక్రవాండి, మధ్యప్రదేశ్ లోని అమరవాడ స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ స్థానాల్లోని కొందరు లోక్ సభకు ఎన్నికవ్వడంతో రాజీనామా చేశారు. మరికొందరు సిట్టింగ్ సభ్యులు మరణించారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.

ఇండియా వర్సెస్ ఎన్డీఏ

బెంగాల్ లో లోక్ సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకున్న టీఎంసీ.. నాలుగు స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు హోషియార్ సింగ్ (డెహ్రా), ఆశిష్ శర్మ (హమీర్‌పూర్), కెఎల్ ఠాకూర్ (నాలాగర్) మార్చి 22న సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మూడు స్థానాల్లో 13 మంది బరిలో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లోని మంగళూరు స్థానంపై కూడా ఉత్కంఠ పోటీ నెలకొంది. గతేడాది అక్టోబర్‌లో బీఎస్పీ ఎమ్మెల్యే సర్వత్ కరీం అన్సారీ చనిపోయారు. ఈ స్థానంలో ఇండియా కూటమి, బీజేపీ మధ్య పోటీ కొనసాగనుంది. బద్రీనాథ్‌లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర భండారీ, కాంగ్రెస్‌ అభ్యర్థి లఖ్‌పత్‌ సింగ్‌ బుటోలా మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. లోక్ సభ ఎన్నికల్లో ఆప్ పేలవ ప్రదర్శన తర్వాత పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్ అసెంబ్లీ స్థానంలో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తోంది. ఉపఎన్నికల్లో విజయం సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు అగ్ని పరీక్షగా భావిస్తున్నారు.Next Story

Most Viewed