పుణే లగ్జరీ కారు కేసులో మరో ట్విస్ట్.. బ్లడ్ శాంపిల్స్ మార్చేందుకు డాక్టర్లకు రూ.3లక్షలు..!

by Shamantha N |
పుణే లగ్జరీ కారు కేసులో మరో ట్విస్ట్.. బ్లడ్ శాంపిల్స్ మార్చేందుకు డాక్టర్లకు రూ.3లక్షలు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: పూణే లగ్జరీ కారు ప్రమాద కేసులో మరో కీలక విషయం బయటకొచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్‌ను తప్పించేందుకు అతని తండ్రి చేసిన చీటింగ్ ను పోలీసులు బయటపెట్టారు. బ్లడ్ లో ఆల్కహాల్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు బ్లడ్ శాంపిల్స్ ను తారుమారు చేసినట్లు తెలిపారు. వైద్యపరీక్షల కోసం నిందితుడి నుంచి తీసుకున్న బ్లడ్ శాంపిల్స్ ని చెత్తకుప్పలో పడేసి, దాని స్థానంలో వేరే వ్యక్తి రక్తంతో నివేదిక రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది. వేరే శాంపిల్ తో రిపోర్టు రెడీ చేసేందుకు.. నిందితుడి తండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు డబ్బు ఆశచూపినట్లు పూణె సీపీ అమితేశ్ కుమార్ మీడియాకు తెలిపారు. బ్లడ్ శాంపిల్ మార్చేందుకు బాలుడి తండ్రి డాక్టర్లు రూ.3 లక్షలు ముట్టజెప్పినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ససూన్ జనరల్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ అజయ్ తావ్డే, డాక్టర్ హరిహార్నర్ లను పూణే క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. శాంపిల్స్ మార్చేందుకు ప్రమాదం జరిగిన రోజు డాక్టర్ తావ్డేతో నిందితుడి తండ్రి మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. బ్లడ్ రిపోర్టులో ఆల్కహాల్ జాడలు కన్పించలేదు కానీ.. బార్లలో మైనర్ నిందితుడు మద్యం తాగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ఉందన్నారు అధికారులు.

Read More..

Atrocious: మిజోరంలో విషాదం.. 10 మంది కార్మికులు మృతి



Next Story

Most Viewed