జాతీయ రహదారి దిగ్బంధం

by Shyam |
జాతీయ రహదారి దిగ్బంధం
X

దిశ ప్రతినిధి, మెదక్: డీడీలు కట్టి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా నేటికి గొర్రెల పంపిణీ చేయకుండా గొర్రెల కాపరులను సీఎం కేసీఆర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కన్వీనర్ ఆలేటి యాదగిరి అన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని ఆ సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పట్టణంలో గొర్రెలతో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఆలేటి యాదగిరి మాట్లాడుతూ.. గొల్ల కురుమలను కోటీశ్వరులను చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారనీ తెలిపారు. మొదటి విడతలో సగం మందికి మాత్రమే గొర్రెలను పంపిణీ చేశారని తెలిపారు. రెండవ విడతలో గొర్రెల కోసం పెంపకందార్లు అప్పులు చేసి డీడీలు కట్టి ఏడాదిన్నర గడుస్తున్నదని తెలిపారు. అయినా నేటికీ గొర్రెల పంపిణీ చేయకుండా గొర్రెల కాపరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.Next Story

Most Viewed