మిడిలార్డర్ తడబాటే టీమ్‌ఇండియాకు సమస్య: నాసర్

by  |
మిడిలార్డర్ తడబాటే టీమ్‌ఇండియాకు సమస్య: నాసర్
X

దిశ, స్పోర్ట్స్: గత కొన్నేళ్లుగా భారత జట్టు ఐసీసీ టోర్నీల్లో విఫలమవుతూ వస్తున్నది. గ్రూప్ దశలో అద్భుతంగా రాణిస్తూ నాకౌట్‌కు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నది. ఇందుకు కారణమేంటో ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ వివరించారు. టీమ్‌ఇండియా అద్భుతమైన జట్టే. కానీ, ఆటగాళ్ల ఎంపిక, మిడిలార్డర్ తడబాటు వల్ల కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలవుతున్నదని హుస్సేన్ పేర్కొన్నాడు. ‘ఐసీసీ టోర్నీల్లో ఆడే సమయంలో టీమ్‌ఇండియా పరిస్థితులకు అలవాటు పడటం లేదు. ఎప్పుడూ ఒకే ప్రణాళికతో బరిలోకి దిగడం మంచిది కాదు. టాప్ ఆర్డర్ కుప్పకూలితే మిగతా జట్టంతా చేతులెత్తేస్తున్నది. మరోవైపు బంతి స్వింగ్ అయ్యే సమయంలో జట్టు తడబడటం మొదలవుతున్నది. గత ఏడాది వరల్డ్ కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టుతో కూడా ఇలాగే జరిగింది. కోహ్లి, రోహిత్ వెంట వెంటనే అవుటయితే తర్వాత పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు’ అని హుస్సేన్ అన్నాడు. ఇండియా టాప్ ఆర్డర్‌ను కూల్చేస్తే గెలుపు నల్లేరు మీద నడకేనని ప్రత్యర్థులు భావిస్తుండటంలో తప్ప లేదని నాసిన్ అన్నాడు.


Next Story

Most Viewed