సినీ ఇండ్రస్టీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటి కూతురు మృతి

69

దిశ, వెబ్‌డెస్క్ : టీవీ రియాల్టీ షోలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సమన్వీ(6) దురదుష్టవశాత్తు అకాల మరణం చెందింది. గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన సమన్వీ.. ఆమె తల్లి, కన్నడ బుల్లితెర నటి అమృతా నాయుడుతో కలిసి గురువారం సాయంత్రం షాపింగ్‌కి వెళ్లారు.

షాపింగ్ అనంతరం స్కూటీపై ఇంటికి వస్తుండగా.. వారి స్కూటీని వెనుక నుంచి ఓ టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలతో సమన్వీ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన అమృతా నాయుడుని ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.