పాఠ్యాంశాల్లో NTR చరిత్ర అభినందనీయం : రామకృష్ణ

by  |
పాఠ్యాంశాల్లో NTR చరిత్ర అభినందనీయం : రామకృష్ణ
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ పాఠ్యాంశాల్లో స్వర్గీయ నందమూరి NTR జీవిత చరిత్రను పొందుపరచడం అభినందనీయమని నందమూరి రామకృష్ణ అన్నారు. దీనికి సంబంధించి గురువారం ఆయన ఒక ప్రెస్‌నోట్ విడుదల చేశారు. తన తండ్రి జీవిత చరిత్రను తెలంగాణ స్కూల్ ఎడ్యూకేషన్‌లో ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్, కేబినెట్ మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం తనకు చాలా సంతోషాన్ని కలుగజేసిందని వివరించారు.

NTR ఒక నటుడుగానే కాకుండా, ముఖ్యమంత్రిగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన అందించిన సేవలను తెలుగు ప్రజలే కాకుండా, యావత్భారతం గుర్తుపెట్టుకుందని చెప్పారు. అంతటి మహనీయుని జీవిత చరిత్రను తెలంగాణ పాఠశాల సిలబస్‌లో చేర్చడం వలన భావితరాలకు తప్పకుండా మార్గ దర్శకం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. NTRలో ఉన్న నీతి, నిజాయితీ, కృషి, క్రమశిక్షణా, పట్టుదల, నిబద్ధతా…వీటన్నింటినీ భావితరాల విద్యార్థులు ఒక ఊపిరిగా, స్ఫూర్తిగా తీసుకొని పాటిస్తే వారు భవిషత్తులో ఉత్తమ పౌరులుగా తయారవుతారని ఆశించారు.


Next Story

Most Viewed