ఆలయంలో అద్భుతం.. భక్తులకు ఆ విధంగా దర్శనమిచ్చిన పాము (వీడియో)

by  |
ఆలయంలో అద్భుతం.. భక్తులకు ఆ విధంగా దర్శనమిచ్చిన పాము (వీడియో)
X

దిశ,పరకాల: దీపావళి తర్వాత వచ్చే కార్తీకమాస అమావాస్య చతుర్ధినాడు అత్యంత భక్తి శ్రద్ధలతో నాగుల చవితి జరుపుకోవడం భక్తులు పుణ్య కార్యంగా భావిస్తారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారంగా నాగుల చవితి ప్రతీతి. నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలో హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పెద్ద కోడెపాక గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి జల జ్యోతిర్లింగ ఆలయంలో అనూహ్యంగా నాగుపాము శివాలయం పైనుండి కిందకి వచ్చి భక్తులు నాగుల చవితి సందర్భంగా పుట్ట వద్ద పాలు పోస్తుండగా అక్కడికి వెళ్లి పాలు తాగినట్లు భక్తులు తెలియజేశారు. పామును దైవస్వరూపంగా భావించిన మహిళ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి ఉన్నట్లు సమాచారం. స్వయాన దేవుడే వచ్చి తమను తరింప చేశాడంటూ పులకించిపోయారు. ఆలయ ప్రధానార్చకులు అనుదీప్ శర్మ, శర్మ పూజాఇత్యాది కార్యక్రమాలు నిర్వహించి పామును సురక్షితంగా పుట్టలోకి పంపించడం జరిగిందన్నారు.



Next Story

Most Viewed